![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -248 లో... మురారికి కృష్ణ అంటే ప్రాణమని, కృష్ణ కోసమే క్యాంప్ కి వచ్చినట్టు, కృష్ణని ప్రేమిస్తున్నట్లు కృష్ణకి చెప్తుంది రేవతి. అది విని మొదట సంబరపడ్డ తర్వాత నేను వెళ్ళాకూడదని ఇలా చెప్పారు కావచ్చని కృష్ణ అనుకుంటుంది. అయిన ఏసీపీ సర్ నన్ను ప్రేమిస్తే తనే వచ్చి ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా అని కృష్ణ అంటుంది. ఆ విషయం మీరు ఇంటికి వెళ్ళాక తెల్చుకోండని రేవతి చెప్తుంది. సరే అని కృష్ణ అంటుంది.
మరొక వైపు మురారి, కృష్ణల గదిలోకి ముకుంద వెళ్ళి.. కృష్ణ వస్తువులు ఏవి లేకుండా చేస్తుంది. మురారి నా వాడు. తన ప్రేమ నాకు మాత్రమే సొంతమని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు రేవతితో కృష్ణ కలిసి.. మురారి దగ్గరికి వస్తుంది మురారి సంతోషపడుతు.. నా అమ్మ ఏం చెప్పి తీసుకొని వచ్చిందో తెలియదు గాని నువ్వు మళ్ళీ వస్తున్నావ్ కృష్ణ అని మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నన్ను ప్రేమిస్తు ఆ విషయం నాతో చెప్పకుండా దాచరా ఏసీపీ సర్, నన్ను నిజంగానే ప్రేమిస్తే, ఆ విషయం తనతోనే చెప్పిస్తా..ప్రేమించడం లేదంటే ప్రేమించేలా చేసుకుంటా అని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ ఇంటికి బయలుదేర్తారు. ఇంటికి వెళ్ళిన తరవాత కృష్ణ అందరితో మాట్లాడుతుంది. నేను ఇచ్చిన గిఫ్ట్స్ అందరికి నచ్చాయా అని రేవతిని కృష్ణ అడుగుతుంది. కానీ ముకుందకి నచ్చకపోవచ్చని కృష్ణ అనగానే.. ముకుంద పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించింది. అది మర్చిపోయి పెళ్లి జీవితంలో హ్యాపీగా ఉండమని చెప్పానని కృష్ణ అనగానే.. అలా ఉచిత సలహాలు ఇంకొకసారి ఇవ్వకు అని కృష్ణని కోప్పడుతుంది.
ఆ తర్వాత మీరు ఎవరినైనా ప్రేమించారా అని మురారిని కృష్ణ అడుగుతుంది. మరొక వైపు కృష్ణ, మురారీల గదిలో "ముకుంద, మురారి" అనే పేర్లతో డెకరేషన్ చేస్తుంది. ఆ తర్వాత మురారికి ముకుంద ఫోన్ చేసి.. మన ప్రేమ గురించి పెద్ద అత్తయ్యకి చెప్తున్నా అని చెప్పగానే.. మురారి వద్దు అంటాడు. ఆ లోపే ముకుంద ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి ఏసీపీ సర్ ఎవరినైనా ప్రేమించారా? చెప్పట్లేదని కృష్ణ అడుగుతుంది. దాంతో అందరి ముందు అలాగేనా అడిగేది అని కృష్ణపై రేవతి కోప్పడుతుంది.
మరొకవైపు ముకుంద తన ప్రేమ విషయం భవానికి చెప్పాలని అనుకొని డెకరేషన్ చేసిన దగ్గరికి భవానిని తీసుకొని వెళ్తుంది. అప్పుడే కృష్ణ, మురారి, రేవతి ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన మధు.. కృష్ణ వాళ్ళు వచ్చారంటూ అరుస్తాడు. భవాని లోపలికి వెళ్లకుండానే కృష్ణ వాళ్ళు వచ్చారని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇక వెళ్లిపోద్ది అనుకున్న కృష్ణ మళ్ళీ వచ్చిందని తెలిసి ముకుంద షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!
![]() |
![]() |